అక్టోబర్, 2007 నెల టపాలు

సరసము విరసము కొరకే…….

అక్టోబర్ 23, 2007

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక భాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చు కొరకే తధ్యము సుమతీ

అడిగిన జీతంబియ్యని……

అక్టోబర్ 20, 2007

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటె
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నక బ్రతుకవచ్చు మహిలో సుమతీ

                                      సుమతి శతకము

యెప్పుడు సంపద ….

అక్టోబర్ 19, 2007

యెప్పుడు సంపద గలిగిన
నప్పుడు బందువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పలుగ జెరువు నిండిన
గప్పలు పదివేలు చేరుగదరా సుమతీ

కనకపు సింహాసనమున….

అక్టోబర్ 18, 2007

కనకపు సింహాసనమున

 శునకమును గూర్చుండబెట్టి శుభ లగ్నమునన్

వొనరుగ పట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ //

తలనుండు …..

అక్టోబర్ 18, 2007

తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుందు వృశ్చికమునకున్
తల తోక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ

తన కోపమే….

అక్టోబర్ 18, 2007

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఖ్ఖమే నరకమంద్రు, తధ్యము సుమతీ

ఉప్పుగప్పురంబు….

అక్టోబర్ 18, 2007

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడ వేరయా
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ

నవ్వకుమీ సభలోపల …….

అక్టోబర్ 15, 2007

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ

కూరిమి గల …..

అక్టోబర్ 13, 2007

కూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే దోచుచుండు నిక్కము సుమతీ