సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక భాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చు కొరకే తధ్యము సుమతీ
సరసము విరసము కొరకే…….
అక్టోబర్ 23, 2007 by ganapatisఅడిగిన జీతంబియ్యని……
అక్టోబర్ 20, 2007 by ganapatisఅడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటె
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నక బ్రతుకవచ్చు మహిలో సుమతీ
యెప్పుడు సంపద ….
అక్టోబర్ 19, 2007 by ganapatisయెప్పుడు సంపద గలిగిన
నప్పుడు బందువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పలుగ జెరువు నిండిన
గప్పలు పదివేలు చేరుగదరా సుమతీ
కనకపు సింహాసనమున….
అక్టోబర్ 18, 2007 by ganapatisకనకపు సింహాసనమున
శునకమును గూర్చుండబెట్టి శుభ లగ్నమునన్
వొనరుగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ //
తలనుండు …..
అక్టోబర్ 18, 2007 by ganapatisతలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుందు వృశ్చికమునకున్
తల తోక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ
తన కోపమే….
అక్టోబర్ 18, 2007 by ganapatisతన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఖ్ఖమే నరకమంద్రు, తధ్యము సుమతీ
ఉప్పుగప్పురంబు….
అక్టోబర్ 18, 2007 by ganapatisఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడ వేరయా
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ
నవ్వకుమీ సభలోపల …….
అక్టోబర్ 15, 2007 by ganapatisనవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ
కూరిమి గల …..
అక్టోబర్ 13, 2007 by ganapatisకూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే దోచుచుండు నిక్కము సుమతీ
జననీ జన్మభూమిశ్చ….
సెప్టెంబరు 17, 2007 by ganapatisవాల్మీకము
అపి స్వర్ణమయీ లంకా, నమే లక్ష్మణ! రోచతే
జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ!!
ఇది వాల్మీకంగా ప్రసిద్ది పొందింది. స్వర్ణమయమైన లంక కంటే జన్మభూమియే గొప్పదని భావించాడు శ్రీరాముడు.